ఐపీఎల్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన కుర్రాడు అశుతోష్ శర్మ. అద్భుతమైన ఆటతో పంజాబ్ కింగ్స్ జట్టులో కీలక బ్యాటర్‌గా ఎదిగిన అశుతోష్ గతంలో ఇల్లు గడవడం కోసం అంపైరింగ్ చేశాడట. 2023 ముస్తాక్ అలీ టోర్నీలో రాణించిన అశుతోష్‌ను ఐపీఎల్ వేలంలో రూ.20 లక్షల కనీస ధరకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. తనపై ఉంచిన నమ్మకాన్ని అతడు వమ్ము చేయలేదు.