Homeహైదరాబాద్latest NewsIPL 2024: కోహ్లి ఖాతాలో మరో ఆల్‌టైమ్ రికార్డు..!

IPL 2024: కోహ్లి ఖాతాలో మరో ఆల్‌టైమ్ రికార్డు..!

ఐపీఎల్ 2024లో నిన్న ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో 60 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో ఈ సీజన్‌లో ఎలిమినేటైన రెండో జట్టుగా పంజాబ్ నిలిచింది. మరోవైపు విజయం సాధించిన ఆర్సీబీ ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 47 బంతుల్లో 92 పరుగులతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్ లో కోహ్లి సొగసైన బౌండరీలు, సిక్సర్లతో హోరెత్తించాడు. కానీ దూకుడుగా ఆడే క్రమంలో కోహ్లి సెంచరీని చేజార్చుకున్నాడు. సెంచరీ మిస్ అయిన విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ లో పలురికార్డులను బద్దలు కొట్టింది. ఐపీఎల్ చరిత్రలో మూడు ప్రత్యర్థి జట్ల పై 1000+ పరుగులు చేసిన తొలి ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల పై కోహ్లి వెయ్యికి పైగా పరుగులు చేశాడు. అయితే ఈ అరుదైన జాబితాలో కోహ్లీ తర్వాతి స్థానాల్లో రోహిత్ శర్మ (కేకేఆర్, ఢిల్లీ), డేవిడ్ వార్నర్ (కేకేఆర్, పంజాబ్) ఉన్నారు. వీరిద్దరూ రెండుజట్ల పై వెయ్యి పరుగులు చేశారు. అంతేకాదు కోహ్లీ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యధిక సార్లు 600+ పరుగులు చేసిన ఆటగాడిగా కేఎల్ రాహుల్‌ను సమం కోహ్లీ విరాట్ చేశాడు. కోహ్లీ, రాహుల్ నాలుగు సీజన్లలో 600కు పైగా పరుగులు చేశారు. క్రిస్ గేల్, డేవిడ్ వార్నర్ తలా మూడుసార్లు, డుప్లెసిస్ రెండుసార్లు ఈ గౌరవాన్ని అందుకున్నారు.

Recent

- Advertisment -spot_img