Homeఫ్లాష్ ఫ్లాష్IPL-2024: గిల్‌కు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. భారీ జరిమానా..!

IPL-2024: గిల్‌కు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. భారీ జరిమానా..!

ఐపీఎల్-2024లో భాగంగా నిన్న అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై గుజరాత్ టైటాన్స్ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో గుజరాత్ ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. మరోవైపు, CSK టాప్-4లోనే కొనసాగుతోంది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ తదుపరి దశకు చేరే అవకాశాలను గుజరాత్ క్లిష్టతరం చేసింది. అయితే ఈ మ్యాచులో స్లో ఓవర్ రేట్ కారణంగా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్‌కు బీసీసీఐ రూ.24 లక్షల ఫైన్ వేసింది. అలాగే 10 మంది టీం సభ్యులకు, ఇంపాక్ట్ ప్లేయర్లకు రూ.6 లక్షల చొప్పున జరిమానా విధించింది. ఈ సీజన్‌లో జీటీ ప్లేయర్లకు జరిమానా వేయడం ఇది రెండోసారి. కాగా నిన్నటి మ్యాచులో గిల్, సాయిసుదర్శన్ సూపర్ సెంచరీలతో చెలరేగారు.

Recent

- Advertisment -spot_img