ఈ ఐపీఎల్ సీజన్ లో పిచ్‌లు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నాయన్న ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ధర్మశాల స్టేడియంలోని హైబ్రిడ్ పిచ్‌ను బీసీసీఐ ప్రయోగాత్మకంగా పరిశీలించనుంది. సిస్ గ్రాస్ కంపెనీ తయారుచేసిన ఈ పిచ్‌లో సహజమైన గడ్డి, పాలీమర్‌లు ఉంటాయి. ఇది బౌలర్లకు మంచి బౌన్స్ ఇస్తుంది. ఐపీఎల్ ఈ పిచ్‌లను రేపు ధర్మశాలలో సిఎస్‌కెతో, అలాగే 9వ తేదీన ఆర్‌సిబితో జరిగే పంజాబ్ మ్యాచ్‌ల్లో హైబ్రిడ్ పిచ్‌లను ఉపయోగించనున్నారు.