Homeహైదరాబాద్latest NewsIPL 2024: సీఎస్కే బిగ్ షాక్.. సీజన్ మొత్తానికి ఆ స్టార్ దూరం..!

IPL 2024: సీఎస్కే బిగ్ షాక్.. సీజన్ మొత్తానికి ఆ స్టార్ దూరం..!

ఐపీఎల్-2024లో ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా మారింది. ప్రస్తుతం టాప్-2లో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ తర్వాతి ప్లేఆఫ్స్ కు చేరుకోవడం దాదాపు ఖాయం అనే చెప్పాలి. ముంబై ఇండియన్స్ మినహా మిగిలిన అన్ని జట్లు మిగిలిన ఆ రెండు స్థానాల కోసం పోటీలో ఉన్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లకు తీవ్ర పోటీ ఉంటుంది. అయితే ఈ కీలక సమయంలో సీఎస్కేకు పెద్ద షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ పతిరానా సీజన్ మొత్తానికి దూరంగా ఉండనున్నాడు. తొడకండరాల గాయం కారణంగా అతను తన స్వదేశానికి తిరిగి వెళ్లనున్నాడు. ఈ శ్రీలంక స్టార్ బౌలర్ ఐపీఎల్ 2024లో ఆరు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. కానీ అతను 13 వికెట్లతో సత్తా చాటాడు. తాజాగా పతిరానా చికిత్స కోసం అతడు తిరిగి శ్రీలంకకు వెళ్తున్నాడని సీఎస్కే ప్రకటన విడుదల చేసింది. ఏ దశలో అయినా మ్యాచ్‌ను మలుపు తిప్పే సామర్థ్యం ఉన్న పతిరనా దూరమవ్వడం చెన్నైకి కోలుకోలేని ఎదురుదెబ్బే అని చెప్పాలి. అయితే సీఎస్కే ఇప్పటికే విదేశీ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్‌ను కోల్పోయిన విషయం తెలిసిందే. జింబాబ్వే‌తో బంగ్లాదేశ్ టీ20 సిరీస్ ఆడుతున్న నేపథ్యంలో ముస్తాఫిజుర్ సీఎస్కే జట్టుకు దూరమయ్యాడు.

Recent

- Advertisment -spot_img