ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ శిఖర్ ధావన్ మరికొన్ని రోజుల పాటు మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. దాదాపు వారం నుంచి పది రోజుల వరకు ధావన్ అందుబాటులో ఉండడని పంజాబ్ కింగ్స్ కోచ్ సంజయ్ బంగర్ తెలిపాడు. భుజానికి గాయమైన కారణంగా నిన్న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌కు కూడా గబ్బర్ దూరమైన విషయం తెలిసిందే.