ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా శనివారం ఆర్‌సీబీ తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‌లో సీఎస్‌కే 27 పరుగుల తేడాతో ఓటమిపాలై ఆఫ్ ప్లేస్ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కేను ప్లే ఆఫ్స్ చేర్చేందుకు ధోనీ ఆఖరి వరకు కష్టపడ్డాడు. ఈ సీజన్‌లో చెన్నైలోని చెపాక్ మైదానం వేదికగా జరిగే ఫైనల్లో ఆడి ఘనంగా ఆటకు వీడ్కోలు పలకాలని ధోనీ భావించాడు. కానీ ఆర్‌సీబీ అతని ఆశలపై నీళ్లు చల్లింది. అయితే సీఎస్‌కే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ అని నెట్టింట చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సీఎస్‌కే మేనేజ్మెంట్ లోని ఓ అధికారి ఈ విషయంపై స్పందించారు. “తన రిటైర్మెంట్ గురించి మేనేజ్మెంట్ కు ధోనీ ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. తన తుది నిర్ణయం చెప్పడానికి రెండు నెలల సమయం కావాలని మాత్రమే ధోనీ చెప్పారు” అని పేర్కొన్నారు.