ఐపీఎల్-2024 సీజన్ చివరి పోరుకు రంగం సిద్ధమైంది. చెపాక్ వేదికగా జరగనున్న ఫైనల్‌లో ఇవాళ కోల్‌కతా నైట్ రైడర్స్- సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. బలాబలాలతో సమానంగా ఉన్న ఇరు జట్లు ఫైనల్‌లో ఫేవరెట్‌గా నిలిచాయి. ఈ నేపథ్యంలో చేపాక్ వేదికగా జరగనున్న ఈ హైవోల్టేజీ మ్యాచ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఐపీఎల్‌లో ఇరు జట్లు మొత్తం 27 మ్యాచ్‌లు ఆడగా, సన్‌రైజర్స్ తొమ్మిది మ్యాచ్‌ల్లో గెలుపొందగా, కేకేఆర్ 18 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. అయితే చెపాక్ స్టేడియం అనగానే అందరికీ స్పిన్నర్ల ఆధిపత్యమే గుర్తుకు వస్తుంది. అయితే ఇరు జట్లలో నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. దీంతో ఏ జట్టు స్పిన్నర్లు సద్వినియోగం చేసుకుంటే వారిదే విజయం అని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.