ఐపీఎల్ 2024 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫైనల్‌కు చేరుకుంది. శుక్రవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 36 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఐపీఎల్ ఫైనల్ చేరడం హైదరాబాద్ ఫ్రాంఛైజీకి ఇది నాలుగోసారి. రేపు ఐపీఎల్ 17వ సీజన్ ఫైనల్‌లో కోల్‌కతా-హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ బలాలపై కోల్‌కతా మెంటార్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఈ సీజన్‌లో హైదరాబాద్ బ్యాటర్లు దూకుడుగా ఆడి భారీ స్కోర్లు చేశారు. అలాగని వారి బ్యాటింగ్ మాత్రమే బలంగా ఉందని చెప్పడం పొరపాటే అవుతుంది. ఆ జట్టులో భువనేశ్వర్, నటరాజన్, కమిన్స్.. ఇలా పేస్ దళం ఉంది’’అని తెలిపాడు.