ఐపీఎల్-2024లో లీగ్ మ్యాచ్‌లు ముగిశాయి. ఇప్పుడు ప్లేఆఫ్‌కు చేరిన జట్లు క్వాలిఫయర్, ఎలిమినేటర్ మ్యాచ్‌ల్లో తలపడతాయి. క్వాలిఫయర్-1లో టాప్-2లో నిలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు నేడు తలపడతాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. ఓడిన జట్టు రేపటి ఎలిమినేటర్ మ్యాచ్‌లో విజేతతో పాటు క్వాలిఫయర్-2లో పోటీపడాల్సి ఉంటుంది. రెండు జట్లు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా ఉన్నాడు. దీంతో ఈరోజు హోరాహోరీ పోరు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. కానీ రికార్డుల పరంగా సన్ రైజర్స్ పై కోల్ కతాదే పైచేయిగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఇరు జట్లు 26 మ్యాచ్‌ల్లో తలపడగా, KKR 17 సార్లు, SRH తొమ్మిది సార్లు గెలిచాయి.
కానీ, కొన్ని విషయాలు ఆరెంజ్ ఆర్మీని సంతోషపరుస్తాయి. ఈ మ్యాచ్ వేదికైన అహ్మదాబాద్‌లో కేకేఆర్ స్టార్ ఆటగాళ్లు గతంలో చెత్త రికార్డును నమోదు చేశారు. కోల్‌కతా జట్టులో సునీల్ నరైన్ చాలా ప్రమాదకరమైన ఆటగాడు. స్పిన్నర్‌గా ప్రత్యర్థిని భయపెడుతున్న నరైన్ ఈ సీజన్‌లో బ్యాటర్‌గా మరింత సమర్థవంతంగా రాణిస్తున్నాడు. అయితే అహ్మదాబాద్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన నరైన్ మూడుసార్లు బౌల్డ్ కావడం గమనార్హం. అంతేకాదు అహ్మదాబాద్‌లో రస్సెల్ రికార్డు కూడా పేలవంగా ఉంది. ఇక్కడ అతని స్ట్రైక్ రేట్ కేవలం 140. ఈ మైదానంలో బౌండరీలు చాలా దూరంలో ఉన్నాయి. SRH బౌలర్లు దీనిని సద్వినియోగం చేసుకొని రస్సెల్ వికెట్‌ను సులభంగా పొందవచ్చు.