పంజాబ్ తాత్కాలిక కెప్టెన్ సామ్ కరన్‌కు ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ భారీ జరిమానా విధించింది. గుజరాత్‌తో మ్యాచ్ సందర్భంగా.. అంపైర్ నిర్ణయంపై తీవ్ర అసహనం వ్యక్తం చేయడంతో అతడికి మ్యాచ్ ఫీజ్‌లో 50 శాతం ఫైన్ విధించింది. అలాగే కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు స్లో ఓవర్‌రేట్‌కు పాల్పడింది. దీంతో ఆ జట్టు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌కు 12 లక్షలు ఫైన్‌ను విధించింది.