Homeహైదరాబాద్latest NewsIPL 2024: వర్షం కారణంగా ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు రద్దైతే.. విజేతను ఎలా నిర్ణయిస్తారో తెలుసా..?

IPL 2024: వర్షం కారణంగా ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు రద్దైతే.. విజేతను ఎలా నిర్ణయిస్తారో తెలుసా..?

IPL 2024 సీజన్‌లోని లీగ్ దశ చివరి మ్యాచ్‌ల సమయంలో వర్షం చాలా మ్యాచ్‌లకు అంతరాయం కలిగించింది. దీంతో 3 మ్యాచ్‌లు రద్దయ్యాయి. క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్ మ్యాచ్‌లు కూడా వర్షం కారణంగా రద్దైతే విజేతను ఎలా నిర్ణయిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో క్వాలిఫయర్ 1 మరియు ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. అయితే అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్లేఆఫ్ మ్యాచ్‌లకు రిజర్వ్ డే ఉంటుంది. నిర్ణీత రోజున మ్యాచ్‌ను ముగించడానికి 120 నిమిషాల అదనపు సమయం అందుబాటులో ఉంది. వర్షం కారణంగా మ్యాచ్ సాధ్యం కాకపోతే రిజర్వ్ డేలో మ్యాచ్ ఆడతారు. రిజర్వ్ డే రోజు కూడా వర్షం కారణంగా క్వాలిఫయర్ 1 మ్యాచ్ సాధ్యం కాలేదనుకోండి.. అప్పుడు కేకేఆర్
ఫైనల్స్‌లోకి ప్రవేశిస్తుంది. ఎందుకంటే పాయింట్ల పట్టికలో కేకేఆర్ జట్టు అగ్రస్థానంలో ఉంది. ఇదిలా ఉంటే ఎలిమినేటర్ మ్యాచ్ రద్దయితే రాజస్థాన్ రాయల్స్ జట్టు ముందుకెళ్తుంది. ఈ నెల 21, 22 తేదీల్లో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్ మ్యాచ్‌లు జరగడం గమనార్హం. ఈ రెండు రోజుల్లో అహ్మదాబాద్‌లో వర్షాలు పడే అవకాశం ఉంది. భారీ వర్షం కురిస్తే మ్యాచ్ ప్రారంభం కాకపోవచ్చు.

Recent

- Advertisment -spot_img