Homeహైదరాబాద్latest NewsIPL 2024: ఇవాళ ఆర్సీబీ-పంజాబ్ మధ్య కీలక మ్యాచ్.. ఓడిన జట్టు ఇంటికే..

IPL 2024: ఇవాళ ఆర్సీబీ-పంజాబ్ మధ్య కీలక మ్యాచ్.. ఓడిన జట్టు ఇంటికే..

ఐపీఎల్-2024లో ఇవాళ ఆర్సీబీ-పంజాబ్ మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఈ రెండు జట్లు ప్లేఆఫ్స్ రేసులో ఉన్నాయి. ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే ఆర్సీబీ మిగతా మూడు మ్యాచుల్లో కచ్చితంగా గెలవాలి. ప్రస్తుతం 8 పాయింట్లు ఉండగా.. మూడు గెలిస్తే 14 పాయింట్లు అవుతాయి. అలాగే మిగతా జట్ల కంటే నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉండాలి. అదే విధంగా పంజాబ్ పరిస్థితీ కుడా అలాగే ఉంది. ప్రస్తుతం రెండు జట్టులు ఆడిన 11 మ్యాచ్ లో 4 మ్యాచ్ లు గెలిచే పాయింట్స్ టేబుల్ లో 7,8 స్థానాల్లో ఉన్నాయి. అద్భుతం జరిగితే తప్ప ఆర్‌సిబి లేదా పంజాబ్ కింగ్స్‌ ప్లేఆఫ్‌కు చేరే అవకాశం లేదు. టాప్-6లో ఉన్న జట్లు మిగిలిన మ్యాచ్‌ల్లో ఓడి వెనుకబడితేనే.. ఆర్‌సీబీ, పీబీకేఎస్ రేసులో నిలుస్తాయి. అయితే ఆ జట్లు టోర్నీలో మిగిలిన మూడు మ్యాచ్‌లకు మూడు గెలవాల్సి ఉంటుంది. ఇవాళ మ్యాచులో ఓడిన జట్టు ప్లేఆఫ్స్ నుంచి నిష్క్రమిస్తుంది. అలాగే గెలిచిన జట్టు రేసులో ముందుకెళ్తుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు పారంభం కానుంది.

Recent

- Advertisment -spot_img