ఐపీఎల్-2024లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇండియన్ క్రికెటర్లదే హవా కొనసాగుతోంది. ఇప్పటివరకు 21 మ్యాచులు జరగ్గా.. బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీ 316 రన్స్, సాయి సుదర్శన్ 191, రియాన్ పరాగ్ 185, శుభ్‌మన్ గిల్ 183, శాంసన్ 178 రన్స్‌తో టాప్‌లో కొనసాగుతున్నారు. బౌలింగ్‌లో యుజ్వేంద్ర చాహల్ 8 వికెట్లు, ఖలీల్ అహ్మద్ 7, మోహిత్ శర్మ 7తో టాప్-3లో ఉన్నారు. టీ20 వరల్డ్ కప్ ముంగిట ఇది మంచి పరిణామమే.