నేడు ముంబై ఇండియన్స్‌తో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాత్రి 7. 30 గంటలకు జరగనుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ 10 మ్యాచ్ లలో 6 విజయాలతో పాయింట్ల పట్టికలో నాల్గవ ర్యాంక్ లో కొనసాగుతుంది. అయితే నేడు జరగబోయే మ్యాచ్ లో హైదరాబాద్ జట్టులో కీలక మార్పులు చేయాలని యాజమాన్యం భావిస్తున్నట్టు సమాచారం. మార్కో జాన్సెన్ స్థానంలో న్యూజిలాండ్ విధ్వంసకర బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్‌కు అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతోంది.