ఐపీఎల్ 2024 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు డూ ఆర్ డై గేమ్ ఆడబోతోంది. నేడు గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈరోజు రాత్రి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్ రేసులో నిలవగలుగుతాయి. ఏ జట్టు ఓడినా ప్లేఆఫ్ రేసులో నుంచి తప్పుకుంటున్నది. ముఖ్యంగా ఆర్సీబీకి ఇది అత్యంత కీలకమైన గేమ్. ఇందులో ఓడిపోతే ముంబై ఇండియన్స్ లాగా ఇంటిముఖం పట్టాల్సిందే.అ యితే గుజరాత్ టైటాన్స్‌పై విరాట్ కోహ్లీకి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. గుజరాత్‌పై ఇప్పటివరకు కోహ్లీ నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 302 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. అయితే కోహ్లీ బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో 3,000 ఐపీఎల్ పరుగులకు చాలా దగ్గరగా ఉన్నాడు . ఇంకో 76 పరుగుల చేయగలిగితే ఈ రికార్డును అందుకోగలుగుతాడు. ఐపీఎల్‌లో ఒకే స్టేడియంలో 3000 పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగా కోహ్లీ నిలుస్తాడు.