ఐపీఎల్ 2024 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ మరో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం లక్నో సూపర్ జెయింట్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 98 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. హర్షిత్ రాణా (3/24), వరుణ్ చక్రవర్తి (3/30) సంచలన బౌలింగ్‌తో కేకేఆర్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 235 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్ లో సునీల్ నరైన్ 39 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్లతో 81 పరుగులు చేయగా.. ఫిల్ సాల్ట్ 14 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్ తో 32 పరుగులతో రాణించాడు. రఘు వంశీ 26 బంతుల్లో 32 పరుగులతో కీలకంగా ఆడారు. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్ మూడు వికెట్లు తీశాడు. రవి బిష్ణోయ్, యుధ్వీర్ సింగ్, యశ్ ఠాకూర్ తలా వికెట్ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన లక్నో సూపర్ జెయింట్ 16.1 ఓవర్లలో 137 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని చవిచూసింది. కేఎల్ రాహుల్ (25), మార్కస్ స్టోయినిస్ (36) టాప్ స్కోరర్లు నిలిచారు. కేకేఆర్ బౌలర్లలో హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లు తీశారు. మిచెల్ స్టార్క్, సునీల్ నరైన్ తలో వికెట్ తీశారు. ఆండ్రీ రస్సెల్‌కు ఒక వికెట్ దక్కింది.