Homeహైదరాబాద్latest NewsIPL 2024: ముంబై ఇండియన్స్ పై కోల్‌కతా ఘన విజయం.. ప్లే ఆఫ్స్ రేసు నుంచి...

IPL 2024: ముంబై ఇండియన్స్ పై కోల్‌కతా ఘన విజయం.. ప్లే ఆఫ్స్ రేసు నుంచి ముంబై అవుట్…!

ఐపీఎల్ 2024 సీజన్‌లో ముంబై ఇండియన్స్ పోరాటం ముగిసింది. జట్టు అధికారికంగా ప్లే-ఆఫ్ రేసు నుండి నిష్క్రమించింది. శుక్రవారం కోల్‌కతా 24 పరుగుల తేడాతో ముంబైపై విజయం సాధించింది. పేలవ బ్యాటింగ్‌తో 170 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ చేధించ లేకపోయింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 19.5 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌటైంది. వెంకటేష్ అయ్యర్ 52 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 70 పరుగులతో రాణించాడు. మనీష్ పాండే 31 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 42 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ముంబై బౌలర్లలో నువాన్ తుషారా, జస్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు తీశారు. హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు తీశాడు. పీయూష్ చావ్లాకు ఒక వికెట్ దక్కింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్ 18.5 ఓవర్లలో 145 పరుగులకే కుప్పకూలింది. సూర్యకుమార్ యాదవ్ 35 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 56 పరుగులు చేశాడు. కేకేఆర్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్ రెండేసి వికెట్లు తీశారు.

Recent

- Advertisment -spot_img