ఐపీఎల్ 2024 సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు మరో విజయాన్ని అందుకుంది. నిన్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సూర్యకుమార్ యాదవ్ 51 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్సర్లతో 102 పరుగులతో విధ్వంసకర సెంచరీతో ముంబైకి విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 173 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ 30 బంతుల్లో 48 పరుగులతో, పాట్ కమిన్స్ 17 బంతుల్లో 35 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో హార్దిక్ పాండ్యా, పీయూష్ చావ్లా మూడు వికెట్లు తీశారు. బుమ్రా, అన్షుల్ కాంబోజ్ తలో వికెట్ తీశారు. అనంతరం లక్ష్యచేధన లో ముంబై ఇండియన్స్ 17.2 ఓవర్లలో 3 వికెట్లకు 174 పరుగులు చేసి విజయం సాధించింది. సూర్యతో పాటు తిలక్ వర్మ 32 బంతుల్లో 37* పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు అజేయంగా 143 పరుగులు జోడించారు. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సెన్, పాట్ కమిన్స్ తలో వికెట్ తీశారు. ఈ ఓటమితో సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. చివరి మూడు మ్యాచ్‌ల్లో ఆ జట్టు రెండు గెలవాల్సిన పరిస్థితి నెలకొంది.