నిన్న జరిగిన సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ మ్యాచ్ లో సరికొత్త రికార్డ్ నమోదు చేసింది. ఛేదనలో 250+ రన్స్ చేసిన తొలి జట్టుగా నిలిచింది. దీంతో ఆర్సీబి పోగొట్టుకున్న అత్యధిక స్కోర్ (263) రికార్డును ఇది భర్తీ చేసినట్లు అయింది. ముంబైతో జరిగిన మ్యాచులో ఆర్సీబి అత్యధిక స్కోరు రికార్డును బ్రేక్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్ (277), నిన్నటి మ్యాచులో 287 కొట్టి సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. తమ రికార్డ్ బ్రేక్ చేసిన జట్టుపైనే ఆర్సీబి కొత్త రికార్డ్ సాధించడం విశేషం.