ఐపీఎల్ 2024లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ నేడు తన హోం గ్రౌండ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ప్రత్యేకంగా రాజస్థాన్ జట్టు పూర్తిగా పింక్ కలర్ జెర్సీలో దర్శనమివ్వనుంది. కొత్త జెర్సీని కెప్టెన్ సంజూ శాంసన్ సోషల్ మీడియాలో పెట్టారు. #PinkPromiseలో భాగంగా వీటిని ధరిస్తున్నారు. దీని ద్వారా సాధికారత పొందిన మహిళలకు వారి మద్దతును విస్తరించాలని జట్టు లక్ష్యంగా పెట్టుకుందని ఫ్రాంచైజీ ప్రకటించింది.
అలాగే ఈ మ్యాచ్ సంబంధించి అమ్ముడుపోయిన ప్రతి టికెట్ పై 100 రూపాయలను రాజస్థాన్ లోని మహిళల కోసం ఉపయోగించడానికి..రాయల్ రాజస్థాన్ ఫౌండేషన్‌కు అందిస్తారు. అంతేకాకుండా, రెండు జట్లు మ్యాచ్ సమయంలో బ్యాటర్లు కొట్టిన ప్రతి సిక్సర్ పై రాజస్థాన్ రాయల్స్, రాయల్ రాజస్థాన్ ఫౌండేషన్ సంభార్ ప్రాంతంలోని 6 ఇళ్లకు సౌర శక్తి(సోలార్ పవర్)ను ఏర్పాటు చేయనున్నట్లు రాజస్థాన్ రాయల్స్ తమ అధికారిక ట్విట్టర్ ఎకౌంట్‌లో చెప్పుకొచ్చింది.