ఐపీఎల్ 2024లో ఆర్సీబీ వరుస ఓటములతో చతికిలపడినా ఇంకా ప్లేఆఫ్స్ అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపై అన్ని మ్యాచ్‌ల్లోనూ భారీ తేడాతో గెలిస్తే 14 పాయింట్లు సాధిస్తుంది. అదే సమయంలో టేబుల్ టాప్‌లో ఉన్న RR, KKR, SRH తమపై మినహా అందరిపై గెలవాలి. PBKS, DC, CSK, GT, LSG, MI జట్లు ఎక్కువ మ్యాచ్‌లు గెలవకూడదు. ఇలా జరిగితే RCBకి ప్లేఆఫ్స్ అవకాశాలు ఉండొచ్చు. ఇవన్నీ జరిగినా ఇతర జట్ల ఫలితాలపై ఆధార పడక తప్పదు.