ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ చెత్త రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఒకే బౌలర్‌లో అత్యధికంగా అవుట్ అయిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. నిన్న ముంబైలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ ఈ చెత్త ఫీట్ నమోదు చేశాడు. ఈ మ్యాచ్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మ.. సునీల్ నరైన్ బౌలింగ్ లో క్యాచ్ ఔట్ అయ్యాడు. రోహిత్‌ను సునీల్ నరైన్ ఔట్ చేయడం ఇది 8వ సారి కావడం విశేషం. మరే బ్యాటర్ కూడా ఇన్నిసార్లు ఒకే బౌలర్ చేతిలో ఔటవ్వలేదు. ఈ జాబితాలో రోహిత్ అగ్రస్థానంలో ఉండగా.. జహీర్ ఖాన్ బౌలింగ్‌లో ధోనీ , సందీప్ శర్మ చేతిలో విరాట్ కోహ్లీ, మోహిత్ శర్మ చేతిలో అంబటి రాయుడు, అమిత్ మిశ్రా చేతిలో రోహిత్ శర్మ, అశ్విన్ బౌలింగ్‌లో ఊతప్ప, బుమ్రా బౌలింగ్‌లో రిషభ్ పంత్, భువనేశ్వర్ కుమార్ చేతిలో అజింక్యా రహానే ఏడుసార్లు చొప్పున ఔటయ్యారు.