ఎప్పటిలానే ఈ సీజన్‌లో కూడా బెంగళూరు ఆట తీరు మారలేదు. నిన్న హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు జట్టు నలుగురు స్టార్ ఆటగాళ్లను పక్కనపెట్టింది. ఈ నలుగురికి చెల్లించే మొత్తం రూ.47 కోట్లు. దీనిపై భారత ఆటగాడు అభినవ్ ముకుంద్ స్పందించాడు. బెంచ్‌లో రూ.47 కోట్లు ఉన్నాయని సెటైర్ వేశాడు. కోట్లు పెట్టి కొన్న కామెరూన్ గ్రీన్ (రూ.17.5 కోట్లు), అల్జారీ జోసెఫ్ (రూ.11.5 కోట్లు), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (రూ.11కోట్లు), మహ్మద్ సిరాజ్ (రూ.7 కోట్లు)లను తుది జట్టులో ఆడించకుండా.. బెంచ్‌కే పరిమితం చేసింది అని సెటైరికల్ గా చెప్పాడు.