Homeహైదరాబాద్latest NewsIPL 2024: రుతురాజ్ ఖాతాలో అరుదైన రికార్డు..!

IPL 2024: రుతురాజ్ ఖాతాలో అరుదైన రికార్డు..!

బుధవారం చెపాక్‌లో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్‌ పై పంజాబ్ కింగ్స్‌ ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. గత నాలుగు మ్యాచ్‌ల్లో చెన్నైకి ఇది మూడో ఓటమి కావడం గమనార్హం. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 48 బంతుల్లో 62 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పంజాబ్ స్పిన్నర్లు రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ బ్రార్ చెరో రెండు వికెట్లతో సత్తాచాటారు. అనంతరం ఛేదనలో పంజాబ్ కింగ్స్ మూడు వికెట్లు కోల్పోయి 17.5 ఓవర్లలో లక్ష్యాన్ని సాధించింది. రొసో 23 బంతుల్లో 43 పరుగులు చేయగా, బెయిర్‌స్టో 30 బంతుల్లో46 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. సీఎస్కే బౌలర్లలో శార్దూల్, గ్లీసన్, దూబె తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేసిన రుతురాజ్ ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. రుతురాజ్ పది మ్యాచ్‌ల్లో 63 సగటుతో 509 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అయితే ఈ క్ర‌మంలోనే అరుదైన రికార్డు సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో 500+ పరుగులు చేసిన చెన్నై సూపర్ కింగ్స్‌కు తొలి కెప్టెన్‌గా రుతురాజ్ నిలిచాడు.

Recent

- Advertisment -spot_img