Homeహైదరాబాద్latest NewsIPL 2024: ధోనీ రికార్డును బ్రేక్ చేసిన సంజూ శాంసన్.. ఏంటంటే..?

IPL 2024: ధోనీ రికార్డును బ్రేక్ చేసిన సంజూ శాంసన్.. ఏంటంటే..?

ఐపీఎల్ 2024 సీజన్‌లో నిన్న రాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ సంజూ శాంసన్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 200 సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో సంజూ శాంసన్ చేరాడు. ఈ క్రమంలో ధోనీ రికార్డును బద్దలు కొట్టాడు. సంజూ 159 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించాడు. 165 ఇన్నింగ్స్‌ల్లో ధోనీ ఈ రికార్డును నమోదు చేశాడు. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో 200 సిక్సర్ల మైలురాయిని అందుకున్న 10వ ఆటగాడిగా నిలిచారు. ఈ జాబితాలో గేల్, రోహిత్, విరాట్, డివిలియర్స్, ధోనీ, వార్నర్, పొలార్డ్, రస్సెల్, రైనా ఉన్నారు.

Recent

- Advertisment -spot_img