Homeఫ్లాష్ ఫ్లాష్IPL-2024: ఇంకా ప్లేఆఫ్స్‌ రేసులోనే లక్నో.. ముంబై పై ఎంత తేడాతో నెగ్గాలంటే…?

IPL-2024: ఇంకా ప్లేఆఫ్స్‌ రేసులోనే లక్నో.. ముంబై పై ఎంత తేడాతో నెగ్గాలంటే…?

IPL-2024లో లీగ్ చివరి దశకు చేరుకుంది. నేడు ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్ జట్లు తమ చివరి లీగ్ మ్యాచ్ ఆడనున్నాయి. ఈ పోరుకు వాంఖడే స్టేడియం వేదికైంది. అయితే ముంబై జట్టు ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ముంబై జట్టుకు ఇది నామమాత్రపు మ్యాచ్ మాత్రమే. అయితే లక్నోపై ముంబై ఇండియన్స్ గెలిచి పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మెరుగుపరుచుకోవాలని భావిస్తోంది. హార్దిక్ సేన 13 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. అయితే నేటి మ్యాచ్ లో భారీ విజయం సాధిస్తే తొమ్మిదో స్థానంలో ఉన్న పంజాబ్ ను వెనక్కి నెట్టే అవకాశం ఉంటుంది. మరోవైపు, లక్నో సూపర్‌జెయింట్స్ కూడా దాదాపు ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. కానీ సాంకేతికంగా లక్నో పోటీలో ఉంది. అయితే తదుపరి దశకు చేరుకోవాలంటే లక్నో ముంబై ఇండియన్స్‌పై 310 పరుగుల తేడాతో గెలవాలి. లక్నో 310 పరుగుల తేడాతో గెలిచినా నేరుగా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేదు. ఆర్సీబీ-సీఎస్కే జట్టు ఫలితంపై ఆధారపడాల్సి ఉంటుంది. దాదాపు లక్నో సూపర్‌జెయింట్స్ కూడా దాదాపు ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిందనే చెప్పాలి.

Recent

- Advertisment -spot_img