Homeహైదరాబాద్latest NewsIPL 2024: ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సునీల్ గవాస్కర్.. ఎలిమినేటర్ లో ఆ జట్టుదే ఏకపక్ష...

IPL 2024: ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సునీల్ గవాస్కర్.. ఎలిమినేటర్ లో ఆ జట్టుదే ఏకపక్ష విజయం..!

నేడు IPL 2024 సీజన్‌లో భాగంగా కాసేపట్లో ప్రారంభం కానున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్‌సిబి, ఆర్‌ఆర్ జట్లుతలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలుపొందిన జట్టు టోర్నీలో ముందడుగు వేయనుండగా, ఓడిన జట్టు టోర్నీ నుంచి వైదొలుగనుంది. ఈ మ్యాచ్ లో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు రంగంలోకి దిగుతున్నాయి. నేడు ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టు శుక్రవారం చెన్నైలో జరిగే క్వాలిఫయర్-2లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడుతుంది. అయితే ఈ సీజన్‌లో ఆర్సీబీ సంచలన ప్రదర్శనతో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. అదే జోరుతో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించి టోర్నీలో ముందడుగు వేయాలని భావిస్తోంది.
అయితే ఈ ఎలిమినేటర్ మ్యాచ్ కూడా క్వాలిఫయర్-1 మాదిరిగానే ఏకపక్షంగా జరిగే అవకాశం ఉందని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. రాజస్థాన్ రాయల్స్‌ను ఆర్‌సీబీ ఘోరంగా ఓడించనుందని జోస్యం చెప్పారు. అసాధారణ ఆటతీరుతో ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశించిన ఆర్‌సీబీ ముందు రాజస్థాన్ రాయల్స్ పై సునాయాసంగా గెలుస్తుందని అన్నాడు. ఆర్‌ఆర్ జట్టు విజయం సాధించాలంటే కేకేఆర్ తరహా ప్రత్యేకమైన ప్రదర్శన చేయాలి. ఈ మ్యాచ్ కూడా ఏకపక్షంగా ముగిసే అవకాశం ఉంది. నా భయం కూడా ఇదే. భీకర ఫామ్‌లో ఉన్న ఆర్‌సీబీ చేతిలో రాజస్థాన్ చిత్తుగా ఓటమిపాలవుతుందని అనిపిస్తోంది.’అని సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు.

Recent

- Advertisment -spot_img