ఈ సీజన్ ఐపీఎల్ 2024లో తొలి సారి సొంతగడ్డ విజయాల లెక్క మారింది. చిన్నస్వామి స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ 7 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై జయభేరి మోగించింది. కోల్‌కతా గత తొమ్మిది మ్యాచ్‌ల సంప్రదాయాన్ని ఈ మ్యాచ్‌తో మార్చేసింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.
ఆరంభం నుంచి కోహ్లి, ఆఖర్లో దినేశ్ కార్తీక్ (8 బంతుల్లో 20; 3 సిక్స్‌లు) మెరిపించారు. అనంతరం కోల్‌కతా 16.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయ లక్ష్యాన్ని ఛేదించి ఘన విజయం అందుకుంది. వెంకటేశ్ అయ్యర్ (30 బంతుల్లో 50; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) రాణించాడు.