ఐపీఎల్-2024లో మరో ఆసక్తికరమైన పోరుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ సిద్ధమైంది. ఉప్పల్ రేపు తమ సొంత మైదానంలో లక్నో సూపర్‌జెయింట్‌తో తలపడనుంది. ప్లేఆఫ్ రేసులో ముందుండాలంటే సన్‌రైజర్స్ తప్పక గెలవాలి. ఈ సీజన్‌లో 11 మ్యాచ్‌లు ఆడిన SRH ఎనిమిది మ్యాచ్‌లు గెలిచి 12 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. తొలి ఆరు మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ ఐదు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఐపీఎల్‌లో రికార్డులను తిరగరాస్తూ ప్రత్యర్థి వెన్నులో వణుకు పుట్టించింది. అయితే గత నాలుగు మ్యాచ్‌ల్లో ఒకే ఒక్క విజయం సాధించింది. అది కూడా రాజస్థాన్ రాయల్స్‌పై ఒక్క పరుగు తేడాతో నెగ్గి ఊపిరి పీల్చుకుంది. అయితే మరోవైపు, ప్లేఆఫ్‌ల రేసు రసవత్తరంగా మారడంతో మిగిలిన మూడు మ్యాచ్‌లు SRHకి చాలా కీలకం. KKR మరియు RR తదుపరి దశకు చేరుకోవడం దాదాపు ఖాయం. మిగిలిన రెండు స్థానాల్లో ఇప్పుడు పోటీ నెలకొంది. హైదరాబాద్ 12 పాయింట్లతో చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్‌లతో సమంగా ఉన్నాయి. రేపు లక్నోపై గెలవకపోతే సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్ అవకాశాలు కష్టంగా మారుతాయి.