Homeహైదరాబాద్latest NewsIPL-2024: ధోని బ్యాటింగ్ ఆర్డర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వీరేంద్ర సెహ్వాగ్

IPL-2024: ధోని బ్యాటింగ్ ఆర్డర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వీరేంద్ర సెహ్వాగ్

ఐపీఎల్-2024లో భాగంగా నిన్న అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై గుజరాత్ టైటాన్స్ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ ఓటమి పాయింట్ల పట్టికలో వారి స్థానాన్ని ప్రభావితం చేయనప్పటికీ, సీఎస్‌కే రన్ రేట్ పడిపోయింది. అయితే ఈ మ్యాచ్ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ధోనీ 11 బంతుల్లో 26పరుగులతో అందరిని అలరించి ఓటమి అంతరాన్ని తగ్గించాడు. సీఎస్‌కే ఓటమిపై మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అయితే చెన్నై ఓటమికి ధోనీ కారణం కాదన్నాడు. బ్యాటింగ్ పొజిషన్‌ పై చర్చను ఆపాలని సెహ్వాగ్ కోరాడు. గిల్-సుదర్శన్ తరహాలో డారిల్ మిచెల్, మొయిన్ అలీ బ్యాటింగ్ చేయలేకపోయారని సెహ్వాగ్ అన్నారు. ఇక పై ధోనీ బ్యాటింగ్ ఆర్డర్ గురించి చర్చను ఆపాలని ఆయన సూచించారు. ధోనీ ఏమి చేయాలనుకుంటున్నాడో అతనికి తెలుసు అని ధోనీ అన్నారు. అయితే మ్యాచ్ గెలవాలంటే ధోనీలా ఇతర బ్యాటర్లు కూడా అదే స్ట్రైక్‌రేటుతో పరుగులు చేయాలని సూచనలు ఇచ్చాడు. సీఎస్‌కే జట్టులో ఎవరైనా సెంచరీ చేసి ఉంటే.. జడేజా లేదా దూబే 20 బంతుల్లో అర్ధ సెంచరీ కొట్టినట్లయితే, సీఎస్‌కే లక్ష్యానికి చేరువయ్యేదని సెహ్వాగ్ అన్నారు. ఇక ధోని బ్యాటింగ్ గురించి నేను చర్చించదలచుకోలేదు. అతను ఎక్కడ బ్యాటింగ్ చేస్తాడన్నది ముఖ్యం కాదని సెహ్వాగ్ అన్నారు.

Recent

- Advertisment -spot_img