ఐపీఎల్ 2024 లో రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా చరిత్రకెక్కాడు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా సోమవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యుజ్వేంద్ర చాహల్ ఈ ఘనత సాధించాడు. మహ్మద్ నబీని అవుట్ చేయడం ద్వారా చాహల్ ఐపీఎల్లో 200 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. అయితే ఐపీఎల్ చరిత్రలో మొట్టమొదటగా ఆర్పీ సింగ్ 50 వికెట్ల ఘనతను అందుకోగా, లసిత్ మలింగా 100 వికెట్లు, 150 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. తాజాఈ మ్యాచ్‌లో చాహల్ 200 వికెట్ల ఘనతను అందుకున్నాడు.