IPL 2025 లో భాగంగా నిన్న చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో RCB చేతిలో సీఎస్కే ఘోర ఓటమిని చవిచూసింది. నిజానికి గత రికార్డుల ఆధారంగా చూస్తే, ఈసారి చెన్నై గెలుస్తుందని అందరూ భావించారు. కానీ RCB అంచనాలను ధిక్కరిస్తూ 50 పరుగుల తేడాతో గెలిచింది. ఆర్‌సిబి ఐపీఎల్ తొలి సీజన్‌లో రాహుల్ ద్రవిడ్ నాయకత్వంలో చెన్నైలో తొలి విజయాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత నిన్న ఆర్‌సిబి 17 సంవత్సరాల (6155 రోజులు) తర్వాత చెన్నైలో చెన్నైను ఓడించి, ఈ సీజన్‌లో వారి రెండవ విజయాన్ని నమోదు చేసింది. ఈ ఓటమిపై సిఎస్‌కె కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ స్పందించారు. చేపాక్ పిచ్‌పై వారు 170 పరుగులకే పరిమితం కావాల్సిందని, కానీ అదనంగా 20 పరుగులు ఇచ్చారని అన్నారు. అయితే వారు భారీ తేడాతో ఓడిపోలేదని, తేడా కేవలం 50 పరుగులు మాత్రమేనని అన్నారు.