IPL 2025: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రాణే వచ్చింది. ఐపీఎల్ హవా మొదలయ్యింది. ఈ నెల 22 నుండి ఐపీఎల్ మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ అభిమానులకు ఎగిరి గంతేసే వార్త. ఈ సీజన్ లో భాగంగా హైదరాబాద్ మొదటి ఈ రెండు మ్యాచ్ లకు గాను ఇవాళ ఉదయం ( మార్చి 7 ) 11 గంటలకు ఓపెన్ అయ్యాయి. ఈ క్రమంలో SRH అభిమానులకి ఆఫర్ ప్రకటించింది. గత సంవత్సరం అలానే రెండు టికెట్లు కొంటే ఒక జెర్సీ ఉచితంగా ఇస్తామని పేర్కొంది. హైదరాబాద్ లో 23న రాజస్థాన్ తో, 27న జరిగే మ్యాచ్ లో లక్నోతో తలపడనుంది ఆరెంజ్ ఆర్మీ.