IPL-2025 మార్చి 22 నుండి ప్రారంభం కానుంది. కోల్‌కతా వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ (RCB) జట్టు తలపడనుంది. ఈ ప్రారంభ వేడుకలో శ్రద్ధా కపూర్, వరుణ్ ధావన్ డ్యాన్స్ చేయనున్నారట. ఇక వీరికి తోడు పాపులర్ సింగర్ ఆర్జిత్ సింగ్, శ్రేయ ఘోషాల్, పంజాబీ గాయకుడు కరణ్ ఔజ్లా తమ పాటలతో మైమరపింపజేయనున్నారు. ఇంకొందరు బాలీవుడ్ నటీనటులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.