IPL 2025 ప్రారంభం కానున్న వేళ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టేందుకు కేఎల్ రాహుల్ నిరాకరించారని సమాచారం. కెప్టెన్సీ చేపట్టమని ఢిల్లీ క్యాపిటల్స్ (DC) యాజమాన్యం రాహుల్‌ను సంప్రదించగా.. ఆయన సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. బ్యాటింగ్‌పై శ్రద్ధ పెట్టడం కోసం కేవలం ఆటగాడిగా మాత్రమే కొనసాగుతానని రాహుల్ స్పష్టం చేశారని సమాచారం. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్ పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.