HomeతెలంగాణIPL 2025 నిరవధిక వాయిదా.. మళ్లీ మొదలయ్యేదెప్పుడు..?

IPL 2025 నిరవధిక వాయిదా.. మళ్లీ మొదలయ్యేదెప్పుడు..?

భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) 2025 సీజన్ నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం ఈ టోర్నమెంట్ మార్చి 22 నుంచి మే 25 వరకు జరగాల్సి ఉండగా, లీగ్ మ్యాచ్‌లు దాదాపు ముగిశాయి. ప్లే ఆఫ్‌కు చేరుతున్న క్రమంలో భద్రతా కారణాల రీత్యా టోర్నీ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో, ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో జరగాల్సిన ఆసియా కప్ స్థానంలో మిగిలిన ఐపీఎల్ మ్యాచ్‌లను నిర్వహించే అవకాశం ఉందని క్రీడా వర్గాలు తెలిపాయి. ఈ నిర్ణయం ద్వారా ఐపీఎల్ యాజమాన్యం, ఆటగాళ్లు, అభిమానులు ఎప్పుడెప్పుడు టోర్నమెంట్ పునఃప్రారంభమవుతుందా అని ఎదురుచూస్తున్న వారికి కొంత ఊరట లభించనుంది. అయితే, ఈ ప్రతిపాదనపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. భద్రతా పరిస్థితులు, ఆటగాళ్ల లభ్యత, షెడ్యూల్ సర్దుబాటు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని బీసీసీఐ తుది నిర్ణయం తీసుకోనుంది.

Recent

- Advertisment -spot_img