ఆర్‌సిబి స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ మళ్లీ జట్టు కెప్టెన్సీని చేపట్టే అవకాశం ఉందని టీమిండియా మాజీ ఓపెనర్, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాష్ చోప్రా అన్నారు. ఐపీఎల్ 2025 మెగా యాక్షన్ నేపథ్యంలో ఆర్సీబీ టీమ్ గురించి తన యూట్యూబ్ ఛానెల్‌లో చర్చించిన ఆకాష్ చోప్రా.. టీమ్ రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల వివరాలను వెల్లడించాడు. ప్రస్తుత కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, విధ్వంసక బ్యాట్స్‌మెన్ గ్లెన్ మాక్స్‌వెల్‌లు జట్టుకు దూరమయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు చేపడుతాడని అభిప్రాయపడ్డాడు. కోహ్లి కెప్టెన్సీని చేపట్టేందుకు ఇష్టపడకపోతే మెగా వేలంలో జట్టు కొత్త కెప్టెన్‌ని కొనుగోలు చేయాల్సి ఉంటుందని అన్నాడు.