Homeహైదరాబాద్latest NewsIPL Auction 2025: ఆ ప్లేయర్స్ పై కన్నేసిన సన్ రైజర్స్.. దక్కించుకోవాలని చూసే ఆటగాళ్ల...

IPL Auction 2025: ఆ ప్లేయర్స్ పై కన్నేసిన సన్ రైజర్స్.. దక్కించుకోవాలని చూసే ఆటగాళ్ల జాబితా ఇదే!

ఐపీఎల్ మెగా వేలం ఖరారైంది. నవంబర్ 24, 25 తేదీల్లో మెగా వేలం నిర్వహించనున్నట్టు బీసీసీఐ ప్రకటించింది.ఈ నేపథ్యంలో మెగా వేలంలో ఏఏ ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు ప్రయత్నాలు ప్రారంభించాయి. పదునైన ఎత్తుగడలతో సన్ రైజర్స్ హైదరాబాద్ మెగా యాక్షన్ లో బరిలోకి దిగుతోంది. రిటైన్ జాబితా లో హెన్రిచ్ క్లాసెన్‌ను అత్యధిక ధర రూ.23 కోట్లు చెల్లించింది. సన్ రైజర్స్ మిగిలిన రూ.45 కోట్లతో దాదాపు 20 మందిని కొనుగోలు చేయాల్సి ఉంది. మెగా వేలంలో కొనుగోలు చేసే ఆటగాళ్ల జాబితా దాదాపు ఖరారైందని తెలుస్తుంది. రూ.75 కోట్లు వెచ్చించి హెన్రిచ్ క్లాసెన్, ప్యాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, నితీష్ కుమార్ రెడ్డిలను అట్టిపెట్టుకున్న సంగతి తెలిసిందే. కానీ కమిన్స్ మినహా మిగతా ఆటగాళ్లందరూ టాప్-5లో ఆడే ఆటగాళ్లే. అంతేకాదు రిటైన్ లిస్ట్ లో ముగ్గురు విదేశీ ఆటగాళ్లు కూడా ఉన్నారు. ఈ క్రమంలో తక్కువ ధరకు దొరికే సర్ఫరాజ్ ఖాన్, అబ్దుల్ సమద్ లాంటి ఆటగాళ్లను తీసుకోవాలని చూస్తున్నారు. కెప్టెన్ కమిన్స్ తో పాటు కచ్చితంగా మరో నలుగురు బౌలర్స్ కావాలి. దీనికి స్పెషలిస్ట్ స్పిన్నర్ లేదా స్పిన్ ఆల్ రౌండర్ అవసరం. ఈ నేపథ్యంలో మిగిలి ఉన్న మొత్తాన్ని దృష్టిలో ఉంచుకుని, KKR యొక్క యువ స్పిన్నర్ సుయాష్ శర్మ మరియు మయాంక్ మార్కండేలను అన్‌క్యాప్డ్ RTM కార్డ్‌తో పొందాలని SRH భావిస్తోంది.
మెగా వేలంలో సన్‌రైజర్స్ దక్కించుకోవాలనుకునే ప్లేయర్స్ (అంచనా):
విదేశీ ప్లేయర్లు: కేన్ విలియమ్సన్, ఎయిడెన్ మార్కండే, నూర్ అహ్మద్, మహ్మద్ నబీ
భారత ప్లేయర్లు: రాహుల్ త్రిపాఠి, సర్ఫరాజ్ ఖాన్, అబ్దుల్ సమద్, సుయాశ్ శర్మ, మయాంక్ మార్కండే, నటరాజన్, భువనేశ్వర్, ఖలీల్ అహ్మద్, జయదేవ్ ఉనద్కత్, తుషార్ దేశ్‌‌పాండే, ముకేశ్ కుమార్, వాషింగ్టన్ సుందర్, షాబాద్ అహ్మద్, వెంకటేశ్ అయ్యర్.

Recent

- Advertisment -spot_img