Homeహైదరాబాద్latest Newsబార్‌లో ఐపీఎల్ బెట్టింగ్.. ఒకరు అరెస్ట్..

బార్‌లో ఐపీఎల్ బెట్టింగ్.. ఒకరు అరెస్ట్..

హైదరాబాద్ ఫిలింనగర్‌లోని ఓ బార్‌లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేశారు. క్రిఓ వ్యక్తి ఐపీఎల్ మ్యాచ్‌పై ఆన్‌లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేశారు. అతని వద్ద నుంచి నగదు, మొబైల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలపిన వివరాల ప్రకారం… బార్ లో తనిఖీలు నిర్వహించగా సాఫ్ట్ వేర్ ఉద్యోగి చెరుకూరి రమేష్ యాప్ ద్వారా ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. దీంతో రమేష్‌ను అరెస్టు చేసి రూ. 16 వేలతో పాటు సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Recent

- Advertisment -spot_img