IPL : ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా నేడు రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. శనివారం కావడంతో క్రికెట్ అభిమానులకు డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ లభిస్తుంది. చెన్నైలో మధ్యాహ్నం 3.30 గంటలకు చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈరోజు రాత్రి 7.30 గంటలకు పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. చెన్నై ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించగా, మిగతా రెండింటిలో ఓడిపోయింది. ఈరోజు జరిగే మ్యాచ్‌లో గెలిచి మళ్లీ రేసులోకి రావాలనే పట్టుదలతో ఉంది.