ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోడీ మళ్ళీ ప్రేమలో పడ్డాడు. నేడు వాలెంటైన్స్ డే సందర్భంగా ఆయన తన భాగస్వామిని ఉద్దేశించి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. లలిత్ మోడీ ఈ పోస్ట్‌లో 25 సంవత్సరాల స్నేహం ప్రేమగా మారిందని పేర్కొన్నారు. అందరికీ ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఈ పోస్ట్ ద్వారా లలిత్ మోదీ, సుష్మితా సేన్‌తో విడిపోయిన విషయాన్ని పరోక్షంగా ధృవీకరించారని అర్ధమవుతుంది.