స్లో ఓవర్ రేట్ కారణంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ హర్దిక్ పాండ్యాకు బీసీసీఐ షాక్ ఇచ్చింది. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో నిర్ణీత సమయంలో 20 ఓవర్లు పూర్తి చేయకపోవడంతో ఫైన్ విధించింది. కాగా ఇప్పటికే దిల్లీ కప్టెన్ రిషబ్ పంత్‌కు రెండు సార్లు, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్‌కు ఓసారి జరిమానా విధించిన విషయం తెలిసిందే. నిన్న పంజాబ్ కింగ్స్ తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ 9 పరుగుల తేడాతో గెలుపొందింది.