IPL Orange Cap 2008-2024: ఛాంపియన్స్ ట్రోఫీ ముగియడంతో క్రికెట్ అభిమానులు ఇప్పుడు ఐపీఎల్ కోసం ఉత్సాహంగా ఉన్నారు. ఈ సారి ఐపీఎల్ మార్చి 22న ప్రారంభమై మే 25 వరకు కొనసాగుతుంది. ప్రతి ఐపీఎల్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌కు ఆరెంజ్ క్యాప్‌ను ఇస్తారు. 2008 నుంచి 2024 వరకు 17 ఎడిషన్ లో ఆరెంజ్ క్యాప్ విజేతలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
IPL Orange Cap 2008-2024 ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న ఆటగాళ్ల జాబితా:
- 2008 ఐపీఎల్ లో షాన్ మార్ష్ ఆరెంజ్ క్యాప్ ను గెలుచుకున్న తొలి ఆటగాడు. ఈ ఎడిషన్ లో షాన్ మార్ష్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కి ఆడి 616 పరుగులు చేసారు.
- 2009 ఐపీఎల్ లో ఆరెంజ్ క్యాప్ ను మాథ్యూ హెడెన్ గెలుచుకున్నారు. ఈ ఎడిషన్ లో మాథ్యూ హెడెన్ 572 పరుగులు చేసారు. చెన్నై సూపర్ కింగ్స్ కి ఆడారు. ‘
- 2010 ఐపీఎల్ లో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ లో ఆరెంజ్ క్యాప్ ను గెలుచుకున్నారు. ఈ ఎడిషన్ లో ఆయన ముంబై ఇండియన్స్ ఆడి 618 పరుగులు చేశారు.
- 2011 & 2012 ఐపీఎల్స్ లో వరుసగా క్రిస్ గేల్ ఆరెంజ్ క్యాప్ ను దక్కించున్నారు. 2011 ఐపీఎల్ 608 పరుగులు, 2012 లో 733 పరుగులు చేశారు. ఈ రెండు ఎడిషన్స్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఆడారు.
- 2013 ఐపీఎల్ లో మైఖేల్ హస్సీ చెన్నై సూపర్ కింగ్స్ కి అది ఆరెంజ్ క్యాప్ ను గెలుచుకున్నారు. ఈ ఎడిషన్ లో ఆయన 733 పరుగులు చేసారు.
- 2014 ఐపీఎల్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ కి ఆడిన రాబిన్ ఉతప్ప 660 పరుగులతో ఆరెంజ్ క్యాప్ ను దక్కించున్నారు.
- 2015, 2017 & 2019 ఐపీఎల్స్ లో డేవిడ్ వార్నర్ టాప్ స్కోరర్ గా నిలిచి ఇప్పటివరకు ఆరెంజ్ క్యాప్ ను మూడు సార్లు గెలుచుకున్న ప్లేయర్ ఐపీఎల్ చరిత్రలో నిలిచారు. ఈ మూడు ఎడిషన్స్ లో డేవిడ్ భాయ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ కి ఆడి వరుసగా 562, 641 & 692 పరుగులు చేసాడు.
- 2016 & 2024 ఐపీఎల్స్ లో టీమిండియా స్టార్ బ్యాట్సమెన్ విరాట్ కోహ్లీ ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నారు. ఈ రెండు ఎడిషన్స్ లో ఆయన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఆడి వరుసగా 973 & 741 పరుగులు చేసాడు. కోహ్లీ 2016 చేసిన 973 పరుగులు ఐపీఎల్ చరిత్రలో టాప్ స్కోర్ కావడం విశేషం.
- 2018 ఐపీఎల్ లో కేన్ విలియంసన్ ఆరెంజ్ క్యాప్ ను గెలుచుకున్నారు. ఈ ఎడిషన్ లో ఆయన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడి 735 పరుగులు చేసాడు.
- 2020 ఐపీఎల్ లో 670 పరుగులతో కేఎల్ రాహుల్ ఆరెంజ్ క్యాప్ ను దక్కించున్నాడు. ఈ రాహుల్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కి ఆడారు.
- 2021 ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఆడి రుతురాజ్ గైక్వాడ్ 635 పరుగులతో ఆరెంజ్ క్యాప్ ను సొంతం చేసుకున్నాడు.
- 2022 ఐపీఎల్ లో రాజస్థాన్ తరుపున ఆడిన రాయల్స్ జోస్ బట్లర్ రెంజ్ క్యాప్ ను దక్కించున్నారు. ఈ ఎడిషన్ లో బట్లర్ 863 పరుగులు చేసాడు.
- 2023 ఐపీఎల్ లో టీమిండియా యంగ్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ ఆరెంజ్ క్యాప్ ను సొంతం చేసుకున్నాడు. ఈ ఎడిషన్ లో గిల్ అద్భుతమైన బ్యాటింగ్ తో 890 పరుగులు చేసాడు.