Homeహైదరాబాద్latest NewsIPL Playoffs: రసవత్తరంగా ప్లేఆఫ్స్ రేసు.. 4 స్థానాలు 8 జట్లు..!

IPL Playoffs: రసవత్తరంగా ప్లేఆఫ్స్ రేసు.. 4 స్థానాలు 8 జట్లు..!

ఐపీఎల్ 2024 సీజన్ కీలక దశకు చేరుకుంది. ఇప్పటివరకు 58 గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఇంకా లీగ్ దశలో 12 మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పటికీ ఏ జట్టు కూడా అధికారికంగా ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ను ఖరారు చేయలేదు. అనూహ్యంగా కోలుకున్న ఆర్సీబీ కూడా పోటీలో నిలిచింది. ఇప్పటికే ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్‌ ప్లేఆఫ్స్‌ రేసు నుంచి ఎలిమినేట్ కాగా, మిగిలిన టీమ్స్ టాప్-4 పొజిషన్స్ కోసం పోటీపడుతున్నాయి. ఈ మిగిలిన 12 మ్యాచ్‌లు 8 జట్ల భవితవ్యాన్ని తేల్చనున్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్, సీఎస్‌కే, సన్‌రైజర్స్ హైదరాబాద్ టాప్ 4లో ఉన్నాయి.
ఈ నాలుగు జట్లలో కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్ తమ ప్లే ఆఫ్స్ బెర్త్‌ను దాదాపు ఖరారు చేసుకున్నాయి. ఈ రెండు జట్లు మరో విజయం సాధిస్తే అధికారికంగా ప్లే ఆఫ్స్‌ బెర్త్‌కు అర్హత సాధిస్తాయి. రాజస్థాన్ రాయల్స్ ఇంకా 3 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. వీటిలో దేనిలోనైనా గెలిస్తే ఎలాంటి రాజీలు లేకుండా ప్లే-ఆఫ్స్ బెర్త్ ఖాయమవుతుంది. కేకేఆర్ కూడా మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్‌లో గెలిచినా.. మరే ఇతర జట్టుతో సంబంధం లేకుండా ప్లేఆఫ్‌లోకి ప్రవేశిస్తుంది. సన్‌రైజర్స్ మరో రెండు మ్యాచ్‌లో ఒక మ్యాచ్ గెలవాలి. CSK కి మరో మూడు మ్యాచ్ లు ఉన్నాయి. ఇందులో 2 మ్యాచ్ లో గెలుస్తే నేరుగా ప్లే ఆఫ్స్‌ బెర్త్‌కు అర్హత సాధిస్తుంది. ఢిల్లీ క్యాపిటల్స్ టోర్నీలో మిగిలిన 2 మ్యాచ్‌ల్లో రెండింటిలోనూ విజయం సాధించాలి. అలాగే లక్నో సూపర్‌జెయింట్‌లు మరో రెండు మ్యాచ్‌లు గెలవాల్సి ఉంది. అద్భుతం జరిగితే ఆర్‌సిబి ప్లేఆఫ్‌కు చేరుకునే అవకాశం లేదు. టాప్-6లో ఉన్న జట్లు మిగిలిన మ్యాచ్‌ల్లో ఓడిపోతే మాత్రం ఆర్‌సిబి రేసులో ఉంటుంది. అయితే ఆ జట్లు టోర్నీలో మిగిలిన 2 మ్యాచ్‌ల్లో విజయం సాధించాలి. గుజరాత్ టైటాన్స్ దాదాపు గా ఈ రేసు నుంచి తప్పుకు న్నట్లు చెప్పారు. ఆ జట్లు టోర్నీలో మిగిలిన 3 మ్యాచ్‌ల్లో విజయం సాధించాలి.

Recent

- Advertisment -spot_img