సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్. ఈ జట్టు కీలక స్పిన్నర్ వనిందు హసరంగా మడమ నొప్పి కారణంగా తొలి మ్యాచ్ కు దూరమైన విషయం తెలిసిందే. కాగా ఇప్పట్లో నొప్పి తగ్గక పోవడంతో జట్టులో చేరేలా కనిపించడంలేదు. ఇవాళ ముంబైతో జరగనున్న మ్యాచుకూ కూడా దూరం కానున్నారు. వైద్యుల ధ్రువీకరణ తర్వాతే హసరంగా మైదానంలోకి అడుగుపెట్టనున్నారు. అందుకు మరో వారం పట్టనుంది. నొప్పి తగ్గకపోతే అతడు టోర్నీ మొత్తానికి దూరమయ్యే అవకాశం ఉంది.