ఐపీఎల్ 2024లో భాగంగా నిన్న జరిగిన ముంబై, ఆర్సీబీ మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యిందంటూ పలువురు సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేస్తున్నారు. టాస్ వేసే టైంలో మ్యాచ్ రిఫరీ జవగల్ శ్రీనాథ్..టాస్‌ను తిప్పి చూపించారని చెబుతున్నారు. శ్రీనాథ్ టాస్ ఫలితాన్ని మార్చాడనటానికి ఇదే సాక్ష్యమంటూ ఓ వీడియోను పోస్ట్ చేస్తున్నారు. అంపైర్లు సైతం ముంబైకి ఫేవర్‌గా నిర్ణయాలు తీసుకున్నారని ఉదయం నుంచి సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతోంది.