Homeహైదరాబాద్latest NewsIPL2024: స్లో ఓవర్ రేట్ కారణంగా శుభ్‌మ‌న్ గిల్ కు భారీ జరిమానా

IPL2024: స్లో ఓవర్ రేట్ కారణంగా శుభ్‌మ‌న్ గిల్ కు భారీ జరిమానా

స్లో ఓవర్ రేట్ కారణంగా శుభ్‌మ‌న్ గిల్ కు భారీ జరిమానా పడింది. మంగళవారం గుజరాత్ టైటాన్స్ VS చెన్నై సూపర్ కింగ్స్ చెపాక్ వేదికగా జరిగిన మ్యాచులో స్లో ఓవర్ రేట్ కారణంగా ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అతడికి రూ.12 లక్షల జరిమానా విధించింది. ‘మినిమమ్ ఓవర్ రేట్కు సంబంధించి ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం ఈ సీజన్లో అతని జట్టు చేసిన మొదటి నేరం కావడంతో గిల్కి రూ. 12 లక్షల జరిమానా విధించడం జరిగింది’ అని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ తన ప్రకటనలో పేర్కొంది.

కాగా, చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో గుజరాత్ జట్టుపై సిఎస్ కె 63 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోరును సాధించింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (46), రచిన్ రవీంద్ర (46) జట్టుకు శుభారంభం అందించారు. ఆ తర్వాత శివమ్ దూబె 23 బంతుల్లోనే ఐదు భారీ సిక్సర్లు, రెండు బౌండరీలతో 51 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 143 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది.

Recent

- Advertisment -spot_img