రిటైర్డ్ ఐపీఎస్ ఇంటి కబ్జాకు యత్నించిన కేసులో ఐఏఎస్ నవీన్ కుమార్ అరెస్ట్ అయ్యారు. ఈ మేరకు నవీన్ కుమార్ ను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీలో జాయింట్ డైరెక్టర్ గా ఉన్న నవీన్ కుమార్.. రిటైర్డ్ ఐఏఎస్ భన్వర్ లాల్ ఇంట్లో అద్దెకు ఉన్నారు. అయితే, ఆ ఇంటిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారంటూ భన్వర్ లాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో గతంలో నవీన్ కుమార్ ను విచారించి నోటీసులిచ్చారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి నవీన్ కుమార్ అన్న, వదినలను అరెస్ట్ చేసిన సీసీఎస్ పోలీసులు.. తాజాగా నవీన్ కుమార్ ను సైతం అదుపులోకి తీసుకున్నారు.