IPS Transfers : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 77 మంది డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్, సైబరాబాద్‌లో పలువురు ఏసీపీల బదిలీ, పోస్టింగ్ జరిగింది. ఈ బదిలీలు వివిధ జిల్లాల్లోని పోలీస్ విభాగాల్లో పరిపాలనా సామర్థ్యాన్ని పెంచడం, సమర్థవంతమైన పనితీరును నిర్ధారించడం కోసం చేపట్టినట్లు అధికార వర్గాలు తెలిపాయి. బదిలీ అయిన అధికారులు వెంటనే తమ కొత్త పోస్టింగ్‌లలో చేరాలని ఆదేశాలు జారీ అయ్యాయి.